ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై పెంటగాన్ లెక్కలపై వివాదం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

ఇరాన్ యుద్ధంలో మృతి చెందిన అమెరికా సైనికుల సంఖ్య పెంటగాన్ అధికారికంగా వెల్లడించిన దానికంటే ఎక్కువగా ఉందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక సంచలన నిజాలు వెలుగులోకి తెచ్చింది. పెంటగాన్ డేటా ప్రకారం 18 మంది సైనికులు మరణించగా, కనీసం 22 నుంచి 23 మంది వరకు సైనికులు మృతి చెంది ఉంటారని ఐదుగురు అమెరికా అధికారులు తెలిపారు. అయితే ఈ నివేదికను రక్షణ కార్యదర్శి పిట్ హెగ్సెత్ తీవ్రంగా ఖండించారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు సుమారు 820 మందికి పైగా సైనికులు గాయపడగా, మొత్తం సైనిక ఖర్చు 43.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.