ఫిట్నెస్ రహస్యం: ప్రతి రోజులో ఒక గంట ఆరోగ్యం కోసం కేటాయించండి

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పిలుపునిచ్చినట్లు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వెల్లడించారు. రోజులో కేవలం ఒక్క గంటను శారీరక శ్రమ కోసం కేటాయించాలని, పిల్లలను చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు, నిత్యం చురుగ్గా ఉండటం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ధోని స్పష్టం చేశారు.