ఆసియా క్రీడల్లో దుమ్మురేపిన భారత పురుషుల కబడ్డీ జట్టు
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించిందని క్రీడా అధికారులు తెలిపారు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఇరాన్ జట్టును నలభై-ముప్పై నాలుగు తేడాతో మట్టికరిపించి విజయం సాధించామన్నారు. మహిళల జట్టు కూడా ఇదే టోర్నీలో స్వర్తం గెలవడంతో దేశం కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విజయంతో భారత పతకాల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరి టాప్ టెన్ జాబితాలో నిలిచింది.