అన్నదాతలకు షాక్: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత నాలుగు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పదిహేడు వేలకు పైగా లబ్ధిదారులు తగ్గిపోయారని, రైతుల మరణాలు మరియు కటాఫ్ తేదీని సడలించకపోవడం వంటివే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు స్పష్టం చేశారు.