మూకుతి అమ్మన్ రెండు విడుదల వేళ చెన్నై ఆలయంలో నయనతార ప్రత్యేక పూజలు

రిపోర్టర్: అశోక్ స్థలం: చెన్నై

నటి నయనతార నటించిన మూకుతి అమ్మన్ రెండు చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆమె చెన్నైలోని కాళికాంబాల్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. సంప్రదాయ చీరకట్టులో ఆలయానికి విచ్చేసిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్ర యూనిట్ తో పాటు అభిమానుల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయని ఆమె పేర్కొన్నారు.