యువతకు స్వర్ణయుగమని పేర్కొన్న ఎన్ఎస్ఏ అజిత్ దోభాల్

రిపోర్టర్: విజయ్ స్థలం: Roorkee

ఐఐటీూర్కీ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వెయ్యి సంవత్సరాలలో ప్రస్తుత యువతరమే అత్యంత అదృష్టవంతులని ఆయన అభివర్ణించారు. రాబోయే కాలంలో యువతకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని దోభాల్ స్పష్టం చేశారు. గత తరాలు ఎన్నడూ చూడని గొప్ప అవకాశాలు ఇప్పుడు దేశ యువత ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.