'నల్ల చీరలు కట్టుకుంటే దాడి చేస్తారా?': మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad, Telangana
కాంగ్రెస్ పాలనలో మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీ మహిళా సాధికారత గురించి మాట్లాడతారని, కానీ తెలంగాణలో మాత్రం నల్ల చీరలు కట్టుకున్నారన్నకారంతో మహిళా ఎమ్మెల్యేలను, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు ఈడ్చిపడేసి దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ రాజకీయాలకు రాకముందే సబితాక్కా మహిళా పోరాటాలు చేశారని ఎద్దేవా చేశారు.