ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: 92 పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రారంభం
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాష్ట్రవ్యాప్తంగా తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మేయర్, ఛైర్ పర్సన్ పీఠాల కోసం బరిలో నిలబడిన పది వేలకు పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మొత్తం అరవై లక్షల మంది ఓటర్లు తమ తీర్పును ఇచ్చారని, రాత్రి ఎనిమిది గంటల్లోపు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.