శ్రీ పైడితల్లమ్మ పండగ ప్రచార రథం ప్రారంభించిన ఎమ్మెల్యే

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ప్రచార రథాన్ని సోమవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఈఓ శిరీష, పూజారి బంటుపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.