'జ్ఞానస్వరూపుడిగా హంస వాహనంపై మలయప్ప దర్శనం': తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: శివ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంస వాహనంపై స్వామివారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, వేదఘోషలు మరియు గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ఈ దివ్య వేడుకను తిలకించేందుకు భక్తజన సందోహంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.