ఒడిశాలో అరుదైన ఒరాంగుటాన్ల కలకలం, అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణంలో దర్యాప్తు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఒడిశా

ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో అటవీశాఖ అధికారులు ఐదు బేబీ ఒరాంగుటాన్లను రెస్క్యూ చేశారు. ఇండోనేషియా, మలేషియా అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన జీవులు ఒడిశాకు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు, ఎస్టీఎఫ్ విచారణ జరుపుతున్నాయి. అంతర్జాతీయ వైల్డ్‌లైఫ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నల్లటి ఎస్‌యూవీ కారు కోసం గాలింపు ముమ్మరం చేశారు.