డక్కిలి మండలంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైకాపా
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైకాపా అభ్యర్థులు రాపూర్ మహేష్, పాయసం శివ శంకర్ గ్రామాల్ లో పర్యటిస్తూ ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తూ ఇంటింటి ప్రచారంతో రాజకీయ వాతావరణం వేడెక్కించారు.