పెద్దపులి దాడిలో మూడేళ్ల పులిపిల్ల మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: ప్రకాశం

మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్‌ తురిమెళ్ల రేంజ్‌ పాపినేనిపల్లి బీటులో మరో పెద్దపులితో జరిగిన ఘర్షణలో మూడేళ్ల పులిపిల్ల మృతి చెందింది. అటవీ సిబ్బందికి పాడైపోయిన స్థితిలో పులి కళేబరం లభించింది. ఘర్షణలో పెద్దపులి బలంగా కొట్టడంతో పులిపిల్ల మెడ ఎముకలు విరిగి, ఆకలితో మరణించినట్లు టైగర్‌ ప్రాజెక్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.