ప్రేక్షకుల ముందుకు బోల్డ్ కంటెంట్‌తో 'లస్ట్ స్టోరీస్ 3' ట్రైలర్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఇండియా

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ ఆంథాలజీ చిత్రం 'లస్ట్ స్టోరీస్ 3' అధికారిక ట్రైలర్ విడుదలయింది. ఆధునిక కాలంలో ప్రేమ, కోరికలు, మానవ సంబంధాలలోని క్లిష్టమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ దర్శకులు నాలుగు వేర్వేరు లఘు చిత్రాలను తెరకెక్కించారు.