ఇండోనేషియాలో భారీ భూకంపం, వణికిపోయిన జావా ద్వీపం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో శనివారం ఉదయం 6.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూగర్భంలో 376 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ డీప్-ఫోకస్ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి తక్షణ సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో ఇండోనేషియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.