మాచాని శివశంకర్ కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలోని శక్తి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మాచాని శివశంకర్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు బీజేపీ నాయకులు ఘనంగా హాజరయ్యారు. ఈ వేడుకలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీజీఏ దయాసాగర్, పట్టణ ట్రెజరర్ శిల్పి భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.