పెద్దపల్లి జిల్లాలో యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు

రిపోర్టర్: మహేష్ స్థలం: పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈనెల 12న జరిగిన తాండ్ర అక్షితరాణి ఆత్మహత్య కేసును పోలీసులు హత్యగా తేల్చారు. ప్రియుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్ మరో వ్యక్తితో ఆమెకు సాన్నిహిత్యం పెరిగిందన్న కక్షతో పథకం ప్రకారం గడ్డిమందు తాగిపించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.