సంజూ శాంసన్‌కు స్వేచ్ఛనివ్వాలని మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా వ్యాఖ్య
రిపోర్టర్: అశోక్
స్థలం: భారతదేశం
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు కల్పించాలని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. కొత్త టాలెంట్ వస్తున్న ప్రతిసారీ పాత ఆటగాళ్ల విలువ తగ్గిపోదని, సంజూ వంటి ప్లేయర్లను వారి మానాన ఆడనివ్వాలని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశంపై కూడా స్పందిస్తూ ఆటను ఎప్పుడు ఆపాలో ఆటగాడే నిర్ణయించుకుంటాడని పేర్కొన్నారు.