ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఉద్రిక్తతల నడుమ రెవెన్యూ అధికారుల విచారణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఎర్రవల్లి, వెంకటపూర్, వరదరాజపూర్ గ్రామాల్లోని సర్వే నంబర్ 325లో అసైన్డ్ భూముల ఆక్రమణలపై తనిఖీలు చేస్తుండగా, ముందస్తు సమాచారం లేదంటూ స్థానిక రైతులు అధికారులను అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.