ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కు మూడు నూతన స్నిఫ్ఫర్ డాగ్స్ రాక

రిపోర్టర్: విజయ్ స్థలం: ఎన్టీఆర్

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కు రెండు నూతన స్నిఫ్ఫర్ డాగ్స్తో పాటు ఈగల్ టీమ్కు మరో కొత్త శునకం చేరుకున్నట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. నైనా, లక్కీ, రాడో పేర్లు గల ఈ శునకాలు ప్రత్యేక శిక్షణా కేంద్రంలో సుమారు ఏడాది పాటు సమగ్రమైన శిక్షణ పూర్తి చేసుకుని సేవలకు సిద్ధమయ్యాయని తెలిపారు. డచ్ షెపర్డ్ జాతికి చెందిన నైనా పేలుడు పదార్థాల గుర్తింపులో రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం కైవసం చేసుకుంది.