బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌లకు కోర్టు ఊరట

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ ఆవరణలో ఉద్రిక్తతల నేపథ్యంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది. వారిని రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం, తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.