ఆదివాసీలపై అటవీ అధికారుల దాడులను సహించేది లేదని హెచ్చరించిన సీపీఎం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు అన్నారు. శనివారం చెన్నూర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. జిల్లాలో దసలి పంట నష్టం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.