పోలవరం ఎడమ కాలువలోకి గోదావరి జలాలు: సీఎం చంద్రబాబు జలహారతి
రిపోర్టర్: హరి
స్థలం: Polavaram, Andhra Pradesh
పోలవరం ఎడమ కాలువలోకి గోదావరి జలాలు ప్రవహించడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు పరిధిలో నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నీటి విడుదల ద్వారా స్థానిక రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి.