డిమాండ్ల సాధనకోసం మూడు రోజుల పాటు బ్యాంకుల బంద్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: భారతదేశం
కేంద్ర ప్రభుత్వంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చర్చలు విఫలం కావడంతో ఈ నెల 28, 29, 30 తేదీలలో దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకుల బంద్ యథావిధిగా కొనసాగుతుందని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. వారానికి ఐదు రోజుల పనిదినాల అమలుతో పాటు పలు డిమాండ్ల సాధనకోసం బ్యాంకింగ్ ఉద్యోగులు ఈ నిరసన బాట పట్టారు. ఈ సమ్మే కారణంగా దేశవ్యాప్తంగా నగదు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది.