చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయన, అక్టోబర్ 22న నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక 'అలయ్ బలయ్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని చంద్రబాబు స్వీకరించి వేడుకకు హాజరవుతానని హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.