గాడే సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో సుప్రీంకోర్టు స్టే
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయవాడ
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గాడే సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్ డెత్ ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీలు వై.ఎస్. అవినాష్ రెడ్డి, గురుమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించింది. సిట్ దర్యాప్తులో పోలీసుల దారుణాలు వెలుగుచూసిన ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జరపరాదని స్పష్టం చేసింది.