స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు: ఎవరినీ తప్పుపట్టలేదన్న టీడీపీ లీగల్ సెల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మంగళగిరి

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు ఏ రాజకీయ పార్టీని, ఈసీని తప్పు పట్టలేదని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు అవకాశం కల్పించడం కోసమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీదే పూర్తి నిర్ణయాధికారమని కోర్టు స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.