తమిళనాడులో భారీ వర్షాలు: ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: చెన్నై

తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరో పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.