ఇంగ్లండ్ వైట్ బాల్ మెంటార్ గా కెవిన్ పీటర్సన్ నియామకం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ 12 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా వైట్ బాల్ మెంటార్ గా ఆయనను నియమించారు. బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్ బలగంలో పీటర్సన్ చేరనున్నారు. ఈ నియామకంపై స్పందించిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, పీటర్సన్ గతంలో మాల్దీవుల ట్రిప్ కు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ సరదాగా వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.