ముంబైలో దీపావళి బాణసంచా వీడియో వివాదం: నటి దియా మీర్జా క్లిప్ తొలగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: ముంబై
ముంబైలో బాణసంచా కాల్చవద్దంటూ నటి దియా మీర్జా పోస్ట్ చేసిన వీడియోపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆ క్లిప్‌ను తొలగించింది. దీపావళి సంప్రదాయాలపై ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ బీజేపీ ముంబై అధ్యక్షుడు అమీత్ సతమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ముంబై నగరపాలక సంస్థ ప్రముఖులతో ఈ అవగాహన ప్రచారాన్ని నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.