మృత్యువుతో చెలగాటమాడుతున్న చింతపల్లి బండ్రేవ్ తాత్కాలిక కర్రల బ్రిడ్జి ప్రయాణం

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం కోరుకొండ బండ్రేవ్ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండటంతో స్థానికులు తాత్కాలికంగా కర్రలతో రాకపోకలు సాగిస్తున్నారు. బురదమామిడి, తురుమామిడి, బురుగుబైలు, వీరవరం గ్రామస్తులు ప్రాణాలకు తెగించి ఈ ప్రమాదకర మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టరు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.