అమెరికాలో 6 లక్షల డాలర్ల మోసం: జలంధర్‌లో ఎఫ్‌బీఐ వాంటెడ్ అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పంజాబ్

అమెరికాలో 6 లక్షల డాలర్ల భారీ మోసానికి పాల్పడిన మన్‌జిత్ సింగ్ బేడీని జలంధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2024-25 మధ్య ఒక కంపెనీ పేరుతో మోసం చేసి భారత్‌కు పారిపోయిన బేడీపై ఎఫ్‌బీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడి కోసం ఎఫ్‌బీఐ రివార్డు కూడా ప్రకటించింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం, జలంధర్‌లో ప్రయాణిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.