ఉపాధ్యాయులపై దాడులను తీవ్రంగా ఖండించిన మంత్రి అనిత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనకాపల్లి
ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు, అవమానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారాలతో యువతను గందరగోళపరచొద్దని హితవు పలికారు. జరిగిన ఘటనపై ఆధారాలతో వాస్తవాలను ప్రజల ముందుంచుతామని, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడటంలో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.