ఇందిరా గాంధీ వర్ధంతి: దేశ తొలి ప్రధానికి ఘన నివాళులు అర్పించిన మంత్రి
రిపోర్టర్: సురేష్
స్థలం: నల్గొండ
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ ధీరవనితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఇందిరమ్మ ఒక చరిత్ర అని, ఆమె త్యాగం అజరామరమని కొనియాడారు. ఆమె చూపిన స్ఫూర్తి తరతరాలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా నివాళులు అర్పించినట్లు తెలిపారు.