కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: కల్వర్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రిపోర్టర్: అశోక్ స్థలం: కామారెడ్డి

కామారెడ్డి జిల్లా జుక్కల్ వద్ద హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.