సర్వేపల్లి మట్టి తవ్వకాల అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కనుపూరు కాలువ, చెరువు మరియు సర్వేపల్లి జలాశయాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన మట్టి తవ్వకాలు మరియు భారీ అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లఘించి టెండర్లు కేటాయించి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం చేకూర్చిన రిటై ఈఈ నాగరాజు, ఎస్‌ఈ కృష్ణమోహన్‌లపై చర్యలకు ఉపక్రమించింది.