రాధాకృష్ణన్ జీవితం ఆదర్శనీయం: త్రినిటీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ త్రినిటీ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల మాట్లాడుతూ, సాధారణ ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన రాధాకృష్ణన్ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవంలో ఉపాధ్యాయులుగా మారి బోధన చేయడాన్ని యాజమాన్యం అభినందించింది.