'కఠిన చర్యలు తీసుకోవాలి': బీహార్‌లో బేల్ పూరి వ్యాపారిపై దాడి వైరల్

రిపోర్టర్: నరేష్ స్థలం: బీహార్

బీహార్‌లోని పాట్నాలో రోడ్డు పక్కన బేల్ పూరి విక్రయిస్తున్న వ్యాపారిపై ఓ వ్యక్తి దాడి చేసి, ఆహార పదార్థాలను కింద పడేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. సోనూ పాస్న్ అనే వ్యక్తి మెడలో ఉన్న పూరి డబ్బాను లాక్కుని రోడ్డుపై పడేయడంతో పాటు వ్యాపారిని కొట్టిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన బీహార్ పోలీసులు ఈ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పాట్నా పోలీసులను ఆదేశించగా, కొందరు ఇది స్క్రిప్టెడ్ వీడియో అని ఆరోపిస్తున్నారు.