ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ ఒక నేరస్థుడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించి పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.