దివ్యాంగులకు తీపి కబురు: నేటి నుంచి సదరం స్లాట్ల బుకింగ్ ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: రాజాం

దివ్యాంగులు పింఛన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలు పొందేందుకు అత్యంత కీలకమైన సదరం ధ్రువపత్రాల ప్రక్రియ వేగవంతమైందని రాజాం అధికారులు వెల్లడించారు. ఈనెల రెండు నుంచి సదరం స్లాట్ల బుకింగ్ పునః ప్రారంభం కానుందని వారు తెలిపారు. నవంబరు మరియు డిసెంబరు నెలల్ లో వైద్య పరీక్షలు పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.