అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: అయోధ్య
అయోధ్య రామమందిరంలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు దర్యాప్తు చేస్తున్న సిట్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. సెప్టెంబర్ 25 నాటికి చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాలతో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో ట్రస్ట్ అగ్రనేతలను తొలగించి, నూతన సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించారు.