తీవ్ర తుఫాను ముప్పు: పలు జిల్లాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్లు
రిపోర్టర్: హరి
స్థలం: విశాఖపట్నం
అర్నాబ్ తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా సహా పలు తీర ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు రెండు నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్లు తెలిపారు. విద్యార్థుల రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ కుమార్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.