గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

కుక్కునూరు మండలం పెద్దరావిగూడెం పుష్కర ఘాట్ వద్ద నాలుగు రోజుల క్రితం గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన పాల్రాజు (16) మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గత నాలుగు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగగా వేలేరుపాడు మండలం తాటుకూరుగోమ్ము రేవు వద్ద శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. విగతజీవిగా తేలిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దింతో గ్రామంలో విషాదం నెలకొంది.