నాణ్యమైన ఉద్యోగాల కల్పనకే 99 పైసలకే భూములిస్తున్నామన్న మంత్రి నారా లోకేశ్‌

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: దిల్లీ

దిల్లీలో జరిగిన పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా 13వ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్లోబల్‌ కేపబుల్‌ సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు కేవలం 99 పైసలకే భూములు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరులో వేగమే మా ప్రాధాన్యమని, యువతకు ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.