ఏపీ పౌరులకు తీపి కబురు: వాట్సాప్లోనే కుల ధృవీకరణ పత్రాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఏపీ ప్రజలు తమ కుల ధృవీకరణ పత్రాలను ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా వాట్సాప్ ద్వారానే డౌన్ లోడ్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని కల్పించినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు స్పష్టం చేశారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వేదికగా ఈ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే పత్రాలు పొందిన వారు తమ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నామమాత్రపు రుసుము చెల్లించి సులభంగా పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.