విద్యార్థులలో పుస్తక పఠనం పెరగాలి: లయన్స్ క్లబ్ నేత మహేంద్ర కుమార్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు వందల పుస్తకాలను అందజేశారు. ఆధునిక కాలంలో సెల్ ఫోన్ల వాడకం పెరగడంతో పుస్తక పఠనం తగ్గిపోయిందని, తెలుగు భాషను, పుస్తక పఠనా సంస్కృతిని కాపాడుకోవాలని మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.