రాజకీయ సంచలనం: నాటి కేఎస్టీపీ కేసులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై విచారణకు ఆదేశం

రిపోర్టర్: విజయ్ స్థలం: కేరళ

దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, రెండు దశాబ్దాల క్రితం నాటి కేఎస్టీపీ కేసులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై కేరళ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని హోం మంత్రి రమేశ్ చెన్నితల తెలిపారు. అప్పట్లో కేరళ ప్రజా పనుల శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేసిన సమయంలో చేపట్టిన ప్రాజెక్టులో జరిగిన పరిణామాలు, ఇంజినీర్ ఆత్మహత్య ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరగనుందని అధికారులు స్పష్టం చేశారు.