పత్తి తూకాల్లో భారీ అక్రమాలు: కొణిజర్ల మండలం మల్లుపల్లిలో రైతుల ఆందోళన

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

కొణిజర్ల మండలం మల్లుపల్లిలో పత్తి తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలకు రిమోట్ పరికరాలు అమర్చి తూకాలు మారుస్తున్నారని రైతన్నలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి నిజానిజాలు తేల్చాలని, మోసానికి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.