సట్లపూర్ తాండాలో ఘనంగా గాంధీ జయంతి: మహాత్మా చిత్రపటానికి నివాళులర్పించిన సర్పంచ్
రిపోర్టర్: ASIF reporter
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ రూరల్ మక్లూర్ మండలం సట్లపూర్ తాండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూర్య ప్రకాశ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహిపాల్, కార్యదర్శి సుప్రియ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించి పలు గ్రామ సమస్యలు అలాగే అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.