కరీంనగర్‌లో మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల అందజేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కరీంనగర్
కరీంనగర్‌లో డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు డీఆర్డీవో డా.ఎం.గీత సర్టిఫికెట్లు అందజేశారు. 881 మంది మహిళలకు స్కూల్ యూనిఫామ్ కుట్టే కాంట్రాక్టులు ఇచ్చామని, నైపుణ్యాలు పెంచుకుంటే మరిన్ని సబ్సిడీ రుణాలు, అవకాశాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.